News August 25, 2024

ఒంగోలు: కార్ డ్రైవింగ్‌‌కు ఉచిత శిక్షణ

image

జిల్లా కేంద్రమైన ఒంగోలులోని RUDSET సంస్థలో వచ్చేనెల 1వ తేదీ నుంచి 30 రోజులపాటు, యువకులకు కార్ డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు RUDSET సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు దామచర్ల సక్కుబాయమ్మ కళాశాలను సంప్రదించాలన్నారు.

Similar News

News March 31, 2026

మార్కాపురం కలెక్టర్‌కు పలక అందజేత

image

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బీజేపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మార్కాపురం పలకను ఆమెకు అందజేశారు. పలక పరిశ్రమకు ఊతం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే కొన్ని సమస్యలు వివరించి అవి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో శాసనాల సరోజినీ, బొంతల కృష్ణ, జీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 31, 2026

ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు అందజేత

image

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 6 ట్రైసైకిళ్లు, 2 వీల్‌చైర్లు, 4 వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వారి దైనందిన జీవనంలో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News March 31, 2026

మార్కాపురం ప్రమాద ఘటన..పోలీసుల అలర్ట్!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.