News August 25, 2024
క్యాంటీన్ అంకుల్ ఇబ్బంది పెడుతున్నాడు.. బాలిక ఆవేదన

మహారాష్ట్ర బద్లాపూర్‌లోని స్కూల్‌లో చిన్నారులపై స్వీపర్ <<13915653>>లైంగిక<<>> దాడి ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకొచ్చింది. వాసాయ్‌లోని ఓ స్కూల్‌లో ఏడేళ్ల బాలికపై క్యాంటీన్ వర్కర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. క్యాంటీన్‌కు వెళ్లేందుకు చిన్నారి నిరాకరించడంతో టీచర్ విషయం ఆరా తీసింది. క్యాంటీన్ అంకుల్ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News November 5, 2025
డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్, ప్లాంక్స్ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.
News November 5, 2025
ఎన్టీఆర్ ఊర మాస్ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తీస్తోన్న మూవీ షూట్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా బరువు తగ్గడంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ బియర్డ్ లుక్‌లో NTR హ్యాండ్సమ్‌గా ఉన్నారని, ‘డ్రాగన్’ మూవీ లుక్ ఇలానే ఉంటుందా? అంటూ పోస్టులు చేస్తున్నారు. తారక్ లుక్ ఎలా ఉంది? COMMENT
News November 5, 2025
సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


