News August 25, 2024

‘$’ సింబల్‌పై భవీష్ ట్వీట్.. నెట్టింట విమర్శలు!

image

కంప్యూటర్ కీబోర్డుపై $ సింబల్‌ను తొలగించి ₹ సింబల్‌ను ఏర్పాటు చేయాలని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుంటే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. $ సింబల్ డాలర్‌తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉపయోగించే క్యారెక్టర్ అని, కావాలంటే మీ ఉద్యోగులను అడగాలని కౌంటర్ ఇస్తున్నారు. అయితే, OLA కి బదులు ‘ఔలా’ అని మార్చొచ్చుగా అని సెటైర్లు కూడా వేస్తున్నారు.

Similar News

News November 10, 2025

భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

image

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్‌ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.

News November 10, 2025

ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

image

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.