News August 25, 2024

‘హైడ్రా’ నెక్ట్స్ టార్గెట్ వారేనా?

image

అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా నిన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. దీని తర్వాతి టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో మల్లారెడ్డి కాలేజీని చెరువులోనే నిర్మించారంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులొస్తున్నాయి. అటు పల్లాకు చెందిన అనురాగ్ కాలేజీ కూడా అక్రమ నిర్మాణమేనని ఆరోపణలున్నాయి.

Similar News

News March 20, 2026

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 పెరిగి రూ.1,50,930కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.600 పెరిగి రూ.1,38,350 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.

News March 20, 2026

NTR అవార్డు.. నా జీవితంలో గొప్ప గౌరవం: చిరంజీవి

image

‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ అందుకోవడాన్ని తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు నటుడు చిరంజీవి తెలిపారు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకొని వెళ్లిన మహా కళాకారుడు అన్నారు. NTR అంటే.. N నాట్యం, T తాళం, R రాగంతో కూడిన కళల సమ్మేళనం అని కొనియాడారు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచారన్నారు.

News March 20, 2026

ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

image

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.