News August 25, 2024
‘అర్జున్ రెడ్డి’ ఫుల్ కట్ రిలీజ్ చేయాలి: విజయ్ దేవరకొండ

<<13936404>>అర్జున్‌రెడ్డి<<>> సినిమా రిలీజై నేటితో ఏడేళ్లు పూర్తయ్యింది. దీనిపై హీరో విజయ్ దేవరకొండ Xలో స్పందించారు. ‘ఈ మూవీకి ఏడేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గత ఏడాది జరిగినట్లుగానే అనిపిస్తోంది. 10వ వార్షికోత్సవానికి అర్జున్ రెడ్డి ఫుల్ కట్‌ను ప్రజలకు చూపాలని డైరెక్టర్ సందీప్‌రెడ్డిని కోరుతున్నా’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రం ఒరిజినల్ రన్ టైమ్ 220 నిమిషాలపైనే ఉండగా, 182 నిమిషాల నిడివితో రిలీజైంది.
Similar News
News April 1, 2026
IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.
News April 1, 2026
అమరావతి బిల్లుపై చర్చకు YCP

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.
News April 1, 2026
రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.


