News August 25, 2024
రావి ఆకులపై చిన్ని కృష్ణుడి చిత్రాలు

సంగారెడ్డి జిల్లా అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆదివారం రావి ఆకులపై విభిన్న రూపాల్లో నంద గోపాలుడి చిత్రాలు గీసి అబ్బురపరిచారు. ఆకులపై రూపొందించిన మురళీ కృష్ణుడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరలై, ఆర్టిస్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 26, 27న శ్రీకృష్ణ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 14, 2026
జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.
News March 14, 2026
మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.
News March 14, 2026
మెదక్: తీవ్ర విషాదం.. కార్మికుడి మృతి!

శివంపేట్ మండలంలోని గోమారంలో విషాదం నెలకొంది. వీధి లైట్ల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికుడు నీరుడి రాములు (48) విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


