News August 25, 2024
N-కన్వెన్షన్ కూల్చివేత: అభిమానులకు నాగార్జున రిక్వెస్ట్

N-కన్వెన్షన్‌పై వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నాగార్జున చెప్పారు. ‘పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఒక్క సెంటూ ఆక్రమించలేదు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014 FEB 24న తీర్పు ఇచ్చింది. నిర్మాణ చట్టబద్ధతపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాం. తీర్పుకు కట్టుబడి ఉంటా. అప్పటివరకు అవాస్తవాలు నమ్మొద్దని అభిమానులను కోరుతున్నా’ అని Xలో పోస్టు చేశారు.
Similar News
News April 2, 2026
హనుమాన్ జయంతి.. ఇలా చేస్తే మనశ్శాంతి!

నేడు చైత్ర పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ ఆంజనేయుడి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. బలం, భక్తికి నిదర్శనమైన పవన సుతుడిని కొలవడం వల్ల కష్టాలు తొలగి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంజన్న భక్తులు నేటి నుంచి మే 12 వరకు 41 రోజుల పాటు దీక్షను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
News April 2, 2026
పింపుల్స్ ఎందుకొస్తాయి?

మొటిమలకు ప్రధాన కారణం శరీరంలో ఇన్సూలిన్ పెరగడమని వైద్యులు చెబుతున్నారు. ‘కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, న్యూడిల్స్ వంటివి ఇన్సూలిన్ స్థాయిని పెంచి, ఆండ్రోజెన్ ఉత్పత్తికి దారి తీస్తాయి. ఈ ఆండ్రోజెన్ చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేయడంతో బాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి. వాల్‌నట్స్, అవిసె, గుమ్మడి గింజలు, చేపలు, పాలకూర, క్యారెట్లు, టమాటా చర్మాన్ని రక్షిస్తాయి’ అని తెలిపారు.
News April 2, 2026
నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.


