News August 25, 2024
మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతిపట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. జడ్పీ ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి డేవిడ్ రాజు ఎదిగారని మంత్రి చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనారోగ్య కారణాలతో డేవిడ్ రాజు ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News March 1, 2026
ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 1, 2026
మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ ఇతర రాష్ట్రాల వారికేనట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.
News March 1, 2026
ఒంగోలు ప్రజాప్రతినిధులతో చర్చించిన CM

చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోల బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.


