News August 25, 2024

హైరిస్క్ జాబితాలో వనపర్తి, మహబూబ్‌నగర్

image

ఉమ్మడి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. మూడు జిల్లా పరిధిలో 75 చికున్‌గున్యా కేసు నమోదు కాగా.. వనపర్తి, MBNR జిల్లాలు చికున్‌గున్యా హైరిస్క్‌లో ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సేవలు విస్తృతంగా పెంచాలని, పరీక్షలు చేయాలని సూచించింది. వ్యాధుల కట్టడిలో వైద్యశాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.

Similar News

News March 4, 2026

మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

image

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

News March 4, 2026

మహబూబ్‌నగర్: రేపు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్!

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

News March 4, 2026

పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్‌ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత