News August 25, 2024

బంగ్లా చేతిలో ఓటమి.. ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాక్

image

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా <<13938635>>ఓడిన<<>> పాకిస్థాన్ WTC పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 6 టెస్టుల్లో 4 ఓటములు, 2 విజయాలతో 30.56% పాయింట్లతో చివరి నుంచి రెండో ప్లేస్‌కు దిగజారింది. ఇండియా 68.52% పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత AUS(62.50%), NZ(50%), ENG(41.07%), SL(40%), BAN(40%), SA(38.89%) ఉన్నాయి. అట్టడుగున WI(18.52) ఉంది.

Similar News

News February 28, 2026

MDK: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.

News February 28, 2026

కలకలం: పరీక్షకు వెళ్లి బాత్రూంలోనే ఇంటర్ విద్యార్థిని గర్భస్రావం

image

TG: భద్రాద్రి జిల్లా పాల్వంచలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో కలకలం రేగింది. 16ఏళ్ల ఫస్టియర్ విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కాసేపటికే నొప్పులతో బాత్రూంకి వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన మహిళా ఇన్విజిలేటర్, సిబ్బంది వెళ్లి చూడగా బాత్రూంలోనే గర్భస్రావమైంది. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని బేసిన్‌లో కుక్కినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె 5 నెలల గర్భవతి అని సమాచారం.

News February 28, 2026

దేవతల ప్రసాదం.. మనమూ తాగొచ్చు!

image

తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం పూర్తయ్యాక బయటకు వస్తే పక్కనే ఓ గట్టుమీద ‘బ్రహ్మ తీర్థం’ ఇస్తారు. ఆ తీర్థం ఏంటంటే.. రోజూ రాత్రి అర్చకులు స్వామివారి వద్ద ఓ పాత్రలో నీరు, గంధం ఉంచుతారు. రాత్రి ఏకాంత సేవలో బ్రహ్మే వచ్చి ఆ నీటితో స్వామికి అర్చన చేస్తారట. మరుసటి రోజు ఆ పవిత్ర జలాన్ని సాధారణ తీర్థంలో కలిపి భక్తులకు ఇస్తుంటారు. అంటే ఆ తీర్థం సృష్టికర్త చేతుల మీదుగా స్వామివారిని తాకిన పవిత్ర జలం అన్నమాట!