News August 26, 2024

శ్రీనివాసుల రెడ్డిని కలిసిన గండిక్షేత్రం మాజీ ఛైర్మన్

image

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డిని గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్ కల్లూరు వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గండిక్షేత్రంలో జరిగే స్వామివారి శ్రావణమాసం ఉత్సవాల పత్రికను, తీర్థ ప్రసాదాలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఈశ్వరయ్య, ఎల్బీఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 13, 2026

కడప: నేటి ఓపెన్ ఇంటర్ పరీక్షకు 312 మంది డుమ్మా

image

కడప జిల్లాలో శుక్రవారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. నేడు జరిగిన బయాలజీ, కామర్స్ పరీక్షలకు 2,864 మంది విద్యార్థులు హాజరయ్యారు. బయాలజీ పరీక్ష 1,199 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 1,049 మంది రాశారు. 150 మంది ఆబ్సెంట్ అయ్యారు. కామర్స్ పరీక్షలకు 1,977 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 1,815 మంది హాజరయ్యారు. 162 మంది పరీక్షలు రాయలేదు. రోజులాగే ఈరోజు చూచిరాతలు జరిగాయి.

News March 13, 2026

కడప: ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు 276 మంది డుమ్మా

image

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 13, 2026

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO శంషుద్దీన్

image

కడప జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. 9 సమస్యాత్మక సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.