News August 26, 2024
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎస్పీ సమీక్ష

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ ప్రదేశాలు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో ఆయన విస్తృతంగా తనిఖీలు చేశారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కార్యాచరణ రూపొందించాలన్నారు.
Similar News
News November 5, 2025
చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.
News November 5, 2025
తిరువన్నామలైలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలైకు బుధవారం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఉన్నారు.
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.


