News August 26, 2024

కృష్ణయ్యను ఈ పూలతో పూజించండి

image

కన్నయ్య పుట్టినరోజును శ్రీ కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇవాళ భక్తులు స్వామివారికి పూజలు చేస్తారు. నల్లన్నయ్యను నీలం రంగ పూలతో పూజించడం, తులసీదళాలతో ఆరాధిస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. వీటితో పాటు శొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, అటుకులను ప్రసాదంగా సమర్పిస్తే సిరి సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

Similar News

News September 15, 2025

కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

image

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.

News September 15, 2025

దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

image

ఒడిశాలో ఓ హాస్టల్‌ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.