News August 26, 2024
కృష్ణుడు-కుచేలుడి స్నేహం తెలుసా?(2/2)

కుచేలుడు తెచ్చిన అటుకులను ప్రేమతో స్వీకరిస్తాడు. కృష్ణుడి మర్యాదలకు పొంగిపోయి కొంచెం దూరం వెళ్లాక అసలు విషయం గుర్తుకు వచ్చినా మిత్రుడిని కలిశాననే ఆనందంలో కుచేలుడు ఇంటికి వెళ్తాడు. అతడి రాకకు గల కారణాన్ని గ్రహించిన నల్లనయ్య అతడికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. నోరు తెరిచి అడగకపోయిన చేసిన సాయానికి కన్నయ్యను కుచేలుడు మనస్సులోనే స్మరించుకుంటాడు. స్నేహానికి అర్థం చెప్పే వీరి బంధం ఎప్పటికీ ప్రత్యేకమే.
Similar News
News November 9, 2025
మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.
News November 9, 2025
బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.
News November 9, 2025
పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


