News August 26, 2024
వర్షాకాలంలో ఆకు కూరలు తింటున్నారా?

ఆకు కూరల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలో తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. వర్షాలతో వాటిపై వైరస్, బ్యాక్టీరియాలు చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు. అయితే శుభ్రంగా కడగటం, తేమ పోయేదాకా ఆరబెట్టడం, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కడగటం చేసి ఆహారంగా తీసుకుంటే రిస్క్ ఏమీ ఉండదని సూచిస్తున్నారు.
Similar News
News March 8, 2026
రక్త పరీక్షలు.. ఎందుకు చేయించుకోవాలి?

* CBC(కంప్లీట్ బ్లడ్ కౌంట్): ఎర్ర, తెల్ల రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్, అనీమియా, లుకేమియా, ఇన్ఫెక్షన్ల గుర్తింపు
* లిపిడ్ ప్రొఫైల్: కొలెస్ట్రాల్& గుండె వ్యాధుల రిస్క్
* బ్లడ్ షుగర్(ఫాస్టింగ్&HbA1c): డయాబెటిస్ అంచనా
* థైరాయిడ్ ప్రొఫైల్(TSH, T3, T4): హార్మోనల్ సమస్యలు
* LFT, KFT: లివర్, కిడ్నీ హెల్త్ చెక్
* విటమిన్ D&B12: ఎనర్జీ, ఇమ్యూనిటీ, బోన్స్ హెల్త్
* CRP/ESR: ఇన్ఫెక్షన్ల గుర్తింపు
#ShareIt
News March 8, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఒక్క రోజే ఛాన్స్!

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 9 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1,012 పోస్టులున్నాయి. రైల్వే అధికారిక <
News March 8, 2026
అన్నింటా నువ్వే.. వందనాలమ్మా!

ఆమె.. మల్టీ టాస్కింగ్ చేయగల నేర్పరి. తల్లిగా, భార్యగా, కోడలిగా ఏకకాలంలో బాధ్యతలు నెరవేర్చగల ఎక్స్‌పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త. ఓపిక ఆమె బలం.. సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవం. అవకాశాల్ని అందిపుచ్చుకుని, అడ్డంకులను దాటుకుని, తమను తాము నిరూపించుకుని ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


