News August 26, 2024

ఏలూరు: ‘జెన్ ప్యాక్ట్‌లో ఉద్యోగ అవకాశాలు’

image

జెన్ ప్యాక్ట్‌ MNC సంస్థలో ఉద్యోగాలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు.

Similar News

News December 25, 2025

గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

image

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 25, 2025

ఎస్.హెచ్.జీ మహిళల ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి: కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాల మహిళలు నెలకొల్పిన ప్రాజెక్టుల అభివృద్ధిలో యువ విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఆమె అధికారులతో సమీక్షించారు. మహిళలు నడుపుతున్న చాక్లెట్ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు వినూత్న మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సుల తయారీపై కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించాలని, తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.