News August 26, 2024

ADB: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

image

ADB జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో 10 నుంచి 25 లోపు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. జిల్లాలో ఒక్క టీచర్ కూడా లేని పాఠశాలలు 18 ఉండగా, 85 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక విద్యార్థులు లేక మూతపడిన స్కూళ్లు 10 ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు టీచర్ల నిర్లక్ష్య వైఖరే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

Similar News

News March 2, 2026

ADB: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు బంగారుగూడ, జైనథ్, బజార్హత్నూర్, నార్నూర్, గుడిహత్నూర్, బోథ్ ప్రవేశ పరీక్ష -2026-27 విద్యా సంవత్సరానికి VI తరగతిలో ప్రవేశాలకు గడువు తేదీని పొడగించినట్లు DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి10 వరకు పొడగించమన్నారు. ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు.

News March 2, 2026

ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

image

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.

News March 2, 2026

ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.