News August 26, 2024
నేటి నుంచే యూఎస్ ఓపెన్

బిగ్గెస్ట్ టెన్నిస్ టోర్నీల్లో ఒకటైన యూఎస్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. పురుషుల సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ జకోవిచ్ ఫేవరెట్‌గా ఉండగా అల్కరాజ్, సినర్ వంటి స్టార్లు బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్, స్వైటెక్, సబలెంక బరిలో ఉన్నారు. 25వ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్ ఇది గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.
Similar News
News March 14, 2026
OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
News March 14, 2026
పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.