News August 26, 2024

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

Similar News

News November 27, 2024

ప్రధాని మోదీతో ఎంపీ డీకే అరుణ భేటీ

image

ప్రధాని నరేంద్ర మోడీతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రధాని నిర్వహించిన కీలక సమావేశంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.

News November 27, 2024

MBNR: ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన సీఎం

image

న్యూఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్స్, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్ లైన్‌లో నమోదు చేసి రైతులకు వెంటవెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 26, 2024

మాగనూరు: జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్

image

మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.