News August 26, 2024
మహిళాభివృద్దే లక్ష్యం: ప్రకాశం కలెక్టర్

స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.
Similar News
News January 8, 2026
త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.
News January 8, 2026
ప్రకాశంలో మొదలైన సంక్రాంతి సందడి

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కొన్ని కళాశాలల్లో భోగి మంటలు వేసి విద్యార్థులకు పండగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు.
News January 8, 2026
రైతులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి: కలెక్టర్

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా సహకార బ్యాంకులు రైతులకు సరైన సమయంలో రుణాలు అందించాలన్నారు.


