News August 26, 2024

HYD: ప్రతీ స్కూల్ నుంచి 5మందికి గొప్ప అవకాశం

image

HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 15, 2025

HYD: గొర్రెల స్కామ్‌‌ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

image

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.

News September 15, 2025

హైదరాబాద్‌కు ‘మోక్షం’ ప్రసాదించారు

image

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్‌. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.

News September 15, 2025

HYDలో భారీ వరద.. రంగంలోకి మేయర్

image

అతి భారీ వర్షానికి నగరంలోని బస్తీలు, కాలనీలతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున వరదనీరు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో నగర మేయర్ విజయలక్ష్మి రాత్రి అక్కడ పర్యటించారు. మోటార్ల సహాయంతో నీటిని తోడేయాలని, రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.