News August 26, 2024

HYD: ట్రాఫిక్ చలాన్లు పెరగనున్నాయి?

image

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ప్రస్తుత చలాన్లపై 5,6 రెట్లు పెంచి పలు నిబంధనల్లో పలు మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇష్టారీతిన వాహనాలు నడిపేవారికి ముక్కు తాడు వేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ 18,33,761 మందికి జరిమానాలు విధించారు.

Similar News

News April 18, 2026

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.