News August 26, 2024

ఖైరతాబాద్: 7 నెలల్లో 5,540 మంది పట్టుబడ్డారు

image

ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు, శిక్షలు విధించినా కొందరు మందు బాబులు మాత్రం మారడం లేదు. మద్యం తాగి పదేపదే దొరుకుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 31వ తేదీ వరకు 7 నెలల వ్యవధిలో వెస్ట్‌జోన్ ట్రాఫిక్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 5,540 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

Similar News

News January 14, 2026

మేడ్చల్ విద్యార్థులకు గమనిక.. 22న ఎంట్రన్స్ టెస్ట్

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 22న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. 5-10 తరగతుల వరకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈనెల 21లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. www.tgswreis.telangana.gov.inలో అప్లై చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను 040 23391598 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..