News August 26, 2024

రూ.2లక్షలకు పైబడి రుణమాఫీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: రూ.2లక్షలకు పైన రుణమాఫీపై ముందడుగు పడింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత నివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అయితే వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ప్రభుత్వం వెల్లడించలేదు.

Similar News

News February 25, 2026

తిరుచ్చిపై విహరించిన శ్రీ కృష్ణస్వామి

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణస్వామివారు బుధవారం రాత్రి బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచ్చి పై నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.

News February 25, 2026

ఊరిలో సగం మంది కవలలే..!

image

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో..

News February 25, 2026

T20 WC: కివీస్‌తో మ్యాచ్.. లంక బౌలింగ్

image

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న కీలక మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8లో ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక ఈ మ్యాచులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే ఇంటిబాట పడుతుంది. అటు పాక్‌తో మ్యాచు వర్షం కారణంగా రద్దవడంతో కివీస్‌కూ ఈ మ్యాచులో గెలవడం తప్పనిసరిగా మారింది. టీమ్స్ వివరాలు పైన ఇమేజ్‌లో చూడొచ్చు. మరి ఇవాళ ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? COMMENT