News August 26, 2024

HYD: రాష్ట్ర స్పీకర్ X అకౌంట్ హ్యాక్..!

image

తెలంగాణ రాష్ట్ర స్పీకర్, VKB అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ (X) హ్యాండిల్ హాక్ అయింది. దీనిపై స్పీకర్ స్పందిస్తూ..మీకు ఎలాంటి సందేశాలు వచ్చినా, వ్యంగ్యమైన పోస్టులు షేర్ చేసినా మీరు ఎవ్వరు పట్టించుకోకండి.
నేను నా X టెక్నికల్ టీంతో మాట్లాడి తిరిగి అకౌంట్ రికవరీ చేయించాను. ఇకపై యథావిధిగా ఎక్స్ అకౌంట్లో మా అప్డేట్స్ చూడగలరు అని స్పీకర్ అన్నారు.

Similar News

News January 15, 2025

జార్జ్ రెడ్డి: ఈ పేరు HYDలో యాదుంటది!

image

‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి పేరు ఎప్పటికీ యాదుంటది. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1947, JAN 15న జార్జ్ జన్మించారు. 1962‌‌లో ఆయన ఫ్యామిలీ HYDలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్ OUలో పీజీ చేశారు. వర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే హత్యచేశారు. నేడు జార్జ్ జయంతి.

News January 15, 2025

త్వరలో OUలో ఇంజినీరింగ్ కోర్సులు

image

ఉన్నత విద్యా మండలి, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదంతో త్వరలో ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు అందుబాటులోకి తీసుకురానున్నామని ఓయూ అధికారులు తెలిపారు. ఉపాధి కల్పన, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు కల్పించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు డిగ్రీ కోర్సుల్లో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థల తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నాయి.

News January 15, 2025

HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.