News August 26, 2024

ఆదిలాబాద్: పంజా విసురుతున్న డెంగీ

image

ఉమ్మడి జిల్లాలో దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 204 డెంగీ కేసులు నమోదయ్యాయి.

Similar News

News February 28, 2026

ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

image

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

image

ఆదిలాబాద్‌‌ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.