News August 26, 2024

టెలిగ్రామ్‌పై భారత్ విచారణ.. అక్రమాలు తేలితే నిషేధం

image

గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. యాప్‌లో P2P(పర్సన్ టు పర్సన్) కమ్యూనికేషన్లను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిశీస్తున్నట్లు ఓ GOVT అధికారి వెల్లడించారు. దర్యాప్తు తర్వాత అక్రమాలు తేలితే యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపారు. యాప్ ఫౌండర్ దురోవ్‌ను ఫ్రాన్స్ పోలీసులు <<13941531>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 20, 2025

2023లో ఎంతమంది పుట్టారంటే?

image

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.

News October 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పతనమై రూ.1,198,00గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 20, 2025

‘K-Ramp’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. శనివారం ఇండియాలో దాదాపు రూ.2.25 కోట్లు(నెట్) వసూలు చేసిన ఈ మూవీ ఆదివారం రూ.2.85 కోట్ల వరకు రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.5.1 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇవాళ హాలిడే నేపథ్యంలో కలెక్షన్స్ పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.