News August 26, 2024

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ SI మృతి

image

కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ కాలనీ దుర్గాదేవి ఆలయ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొండయ్యపాలెంకు చెందిన రిటైర్డ్ SI మోర్త అప్పారావు మృతి చెందారు. అప్పారావు ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి యానాం వైపునకు వెళ్తుండగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు ఘటనాస్థలి చేరుకొని వివరాలు సేకరించారు.

Similar News

News December 4, 2025

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

image

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

News December 4, 2025

కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

News December 4, 2025

ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్‌స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.