News August 26, 2024
సీఎం రేవంత్ జైలుకెళ్లే ప్రమాదం ఉంది: నారాయణ

TG: హైదరాబాద్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలను సీపీఐ నేత నారాయణ సమర్థించారు. ‘హైడ్రా’ ఏర్పాటుతో సీఎం రేవంత్ పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారని అన్నారు. ఒకవేళ స్వారీ ఆపేస్తే పులి తినేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఈ కూల్చివేతలతో బడా బాబులైనా జైలుకెళతారు లేదా వారి ఒత్తిళ్లతో రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్‌లోని ముగ్ధుమ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Similar News
News March 28, 2026
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

గల్ఫ్ దేశాల గగనతలాలు ఉపయోగించుకొని ఇరాన్‌పై US-ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ మండిపడ్డారు. బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, UAE తదితర దేశాలపై తాము దాడులు ఆపాలంటే ఆ 2 దేశాలకు అనుమతి ఇవ్వొద్దన్నారు. ఏ దేశంపైనా తాము ముందస్తు దాడులు చేయబోమని.. తమ అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యం చేసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. శత్రువులకు సహకరించిన వారినీ వదలబోమన్నారు.
News March 28, 2026
‘లుంగీ మ్యాన్’గా సిద్ధూ జొన్నలగడ్డ!

‘డీజే టిల్లు’గా సినీ ప్రేక్షకులను అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త సినిమా అప్‌డేట్ వచ్చింది. అనిల్ అనే కొత్త దర్శకుడితో ఆయన చేస్తున్న మూవీకి ‘లుంగీ మ్యాన్’ అనే టైటిల్ ఖరారయినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఈనెల 19న జరిగింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా సిద్ధూ చివరి 2 సినిమాలు ‘జాక్’, ‘తెలుసు కదా’ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.