News August 26, 2024

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు: హరీశ్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తాగునీటి క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని MLA హ‌రీశ్‌రావు అన్నారు. ‘సంగారెడ్డి (D) వట్‌పల్లి (M) మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు తాగి విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని హ‌రీశ్‌రావు Xలో పోస్టు చేశారు.

Similar News

News November 10, 2025

మెదక్: ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ సంబందిత అధికారులతో మాట్లాడారు.

News November 10, 2025

మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

image

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News November 9, 2025

మెదక్: ’17న ఛలో ఢిల్లీ’

image

సీజేఐ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగ పేర్కొన్నారు. మెదక్‌లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థానంలో ఉన్న దళితులకే రక్షణ లేకుండా పోయిందని, సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.