News August 26, 2024
కృష్ణా: బిరియాని ఇప్పించలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు

విజయవాడలో బిరియాని ఒకరి ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీలో సోమవారం అన్న గాలి రామును తమ్ముడు లక్ష్మారెడ్డి బిరియాని అడిగాడు. రాము బిరియాని ఇప్పించలేదని తమ్ముడు కిటికీ చెక్కతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 5, 2026
కృష్ణా: ఏడాది తొలి వారంలో 417 అర్జీలు

మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి PGRS సోమవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ.. అన్ని అర్జీలను 72 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. PGRS ద్వారా ఇప్పటివరకు 95% అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలో 417 అర్జీలు అందగా సమస్యల పరిష్కారాన్ని ఆన్లైన్లో సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు.
News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.