News August 26, 2024

కొమరాడ: ఏనుగుల దాడిలో రైతు మృతి

image

కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివుడు ఏనుగుల దాడిలో మృతి చెందాడు. సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన శివుడిని ఏనుగుల గుంపు తొక్కి చంపినట్లు సమీప రైతులు చెప్పారు. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు ఒంటరి ఏనుగు హరి వల్లే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా.. ఆ ఏనుగు లేకపోయినప్పటికీ మరొకరి ప్రాణాన్ని ఏనుగులు గుంపు బలి తీసుకుంది.

Similar News

News March 18, 2026

VZM: జిల్లా వాసులకు ముఖ్య గమనిక..!

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.

News March 18, 2026

VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.

News March 18, 2026

VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

image

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.