News August 26, 2024

పార్టీని నడపటం స్టాలిన్‌కు కష్టంగా మారిందా?

image

DMK అంతర్గత పరిస్థితి పైకి చూస్తున్నంత సాఫీగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీని పట్టుకొని వేలాడుతున్నాడంటూ ఏడుసార్లు ఎమ్మెల్యే, ఆరుసార్లు మంత్రి దురైమురుగన్‌పై నటుడు రజనీకాంత్ వ్యాఖ్యల్నే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న స్టాలిన్ కల సాకారం కాకపోవడానికి ఆయనే కారణమని సమాచారం. పైగా DyCM పదవిని ఎవరు కాదనుకుంటారని మురుగన్ మనసులో మాటను బయటపెట్టేశారు.

Similar News

News November 3, 2025

కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

image

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News November 3, 2025

మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

image

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.