News August 26, 2024

ఆయన వల్లే దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్: BJP

image

డిప్యూటీ CM DK శివకుమార్ వల్లే నటుడు దర్శన్‌కు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని బీజేపీ నేత, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోకా విమర్శించారు. జైలులో దర్శన్‌ను కలిసిన డీకే అన్ని రకాల సహాయానికి భరోసా ఇచ్చారన్నారు. మర్డర్ కేసులో నిందితుడికి కాఫీ, సిగరెట్ ఎలా అందాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు

image

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.

News September 19, 2025

ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

image

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

News September 19, 2025

3 వారాలు గడిచినా CBI నుంచి నో రిప్లై!

image

TG: NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరినా <<17577217>>సీబీఐ<<>> స్పందించట్లేదు. సెప్టెంబర్ 2న రాసిన లేఖకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌ను సందర్శించినా సర్కారుకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా సీబీఐ రిప్లై కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని ఉన్నతాధికారులు వే2న్యూస్‌తో తెలిపారు.