News August 26, 2024

GET READY: రేపు ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్ కానుంది. ఈక్రమంలో రేపు రీరిలీజ్ ట్రైలర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేయనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అభిమాన హీరో సినిమాలను మిస్ అవుతున్నామని, ఈ బర్త్ డేకి గబ్బర్ సింగ్‌తో థియేటర్లలో రచ్చ చేస్తామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 25, 2026

ఆముదం మొక్కల కొమ్మల కత్తిరింపుతో లాభాలు(2/2)

image

మొదటి కొమ్మను కత్తిరించిన వారం తర్వాత రెండవ కొమ్మ, రెండో గెలను ఉంచి మిగిలిన కొమ్మలను తీసివేయాలి. ఇలా విడతల వారీగా 5-6 గెలలను ఉంచి మిగిలినవి తీసివేయాలి. దీని వల్ల అనవసర కొమ్మల పెరుగుదల ఆగి, కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క ఎత్తు తగ్గుతుంది. గెల పొడవు, గింజ లావుగా ఉండి తూకం ఎక్కువయ్యే అవకాశం ఉంది. పంట కాలం దాదాపు 40 రోజుల వరకు తగ్గుతుంది. మొక్క ఎత్తు తక్కువగా ఉంటే మందులను సులభంగా పిచికారీ చేయవచ్చు.

News March 25, 2026

అప్పుడు IPL క్రికెటర్.. ఇప్పుడు RCBకి ఛైర్మన్

image

IPL ఫ్రాంచైజీ RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం <<19468471>>కొనుగోలు<<>> చేసిన సంగతి తెలిసిందే. RCB కొత్త ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఎంపికయ్యారు. ఆయన దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2018, 2019లో IPLలో RR జట్టు సభ్యుడిగా ఉన్నారు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. మానసిక ఆరోగ్య కారణాలతో 2019 చివర్లో ఆయన క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.

News March 25, 2026

ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ

image

AP: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 46 ఏళ్లుగా ఉందని, ఇక్కడ కూడా 46కి పెంచాలని కోరారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.