News August 26, 2024
ప్రభుత్వం ‘భరోసా’ను పక్కన పెట్టేసింది: BRS

TG: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ‘అధికారం కోసం రైతు భరోసా రూ.15,000 ఇస్తానని మాయ మాటలు చెప్పి, తీరా గద్దెనెక్కాక రేవంత్ సర్కార్ ఆ హామీని పక్కన పెట్టేసింది. వానాకాలం అయిపోతున్నా డబ్బులు రాకపోవడంతో రైతుల ఆశలు అడియాశలే అయ్యాయి. సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తోంది’ అని BRS ట్వీట్ చేసింది.
Similar News
News January 7, 2026
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కబీంద్ర పుర్కాయస్థ(94) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిల్చార్ (అస్సాం)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931లో జన్మించిన ఈయన 1991, 98, 2009లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. కబీంద్ర మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
News January 7, 2026
అక్కడ బీజేపీ-MIM పొత్తు

అంబర్‌నాథ్(MH)లో BJP, కాంగ్రెస్ <<18786772>>పొత్తు<<>> దుమారం రేపగా, అకోలాలో BJP-MIM కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది. అకోలా మున్సిపల్ కౌన్సిల్‌లో 33 సీట్లకు ఎన్నికలు జరగ్గా BJP 11, కాంగ్రెస్ 6, MIM 5, మిగతా పార్టీలు 11 చోట్ల గెలిచాయి. ఈ క్రమంలో MIM, ఇతర పార్టీలతో కలిసి కూటమిని BJP స్థానిక యూనిట్ ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే MIMతో పొత్తును అంగీకరించబోమని CM ఫడణవీస్ స్పష్టం చేశారు.
News January 7, 2026
BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

IPL నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్‌ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.


