News August 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 2, 9, 16, 23వ తేదీలలో ఏలూరు మీదుగా కాకుండా నిడదవోలు- భీమవరం- గుడివాడ మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్‌లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 15, 2026
అవనిగడ్డ జనసేన, టీడీపీలో ముసలం!

అవనిగడ్డ కూటమి నేతల్లో ముసలం మొదలైంది. కోడూరు TDP అధ్యక్షుడు బండే శ్రీను, MLA బుద్దప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో ఈ వైరం ముదిరింది. మిగిలిన మండలాల్లో వర్గభేదాలు బయటపడనప్పటికీ జనసేన, TDP నేతల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. త్వరలో TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను నియమిస్తారనే ప్రచారం ఉంది. దీంతో MLA కాంపౌండ్ నుంచి ఇన్‌ఛార్జ్ దగ్గరికి TDP నేతలు షిఫ్ట్ అవుతారని టాక్.
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


