News August 26, 2024

వైసీపీకి ఏలూరు మేయర్ రాజీనామా

image

ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే నూర్జహాన్‌తో పాటు ఆమె భర్త, కో-ఆప్షన్‌ సభ్యుడు పెదబాబు సైతం వైసీపీకి రాజీనామా చేశారు.

Similar News

News January 19, 2026

ప.గో: ALERT.. కోర్టులో JOBS

image

ఉమ్మడి ప.గో జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జడ్జి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఏలూరు కోర్టుకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా, నిబంధనల వివరాలను జిల్లా కోర్టు, కలెక్టరేట్, గ్రంథాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News January 19, 2026

భీమవరం వన్‌టౌన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

News January 19, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.