News August 26, 2024
VZM: శతజయంతి ఉత్సవాలలో కేంద్ర మంత్రి

విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని డాక్టర్ పీవీజీ.రాజు నిరూపించారని కేంద్రమంత్రి కే.రామ్మోహన్ నాయుడు అన్నారు. పీవీజీ.రాజు శతజయంతి ఉత్సవాలను సోమవారం కోటలో నిర్వహించిన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విద్యావకాశాలు పెంపొందించి వెనుకబాటుతనాన్ని పోగొట్టే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారని కొనియాడారు.
Similar News
News March 8, 2026
VZM: ప్రైవేట్ బస్సు, స్కూటీ ఢీ.. వ్యక్తి మృతి

అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన అప్పారావు(64)ను అయినాడ జంక్షన్ వద్ద చింతల వలస వైపు స్కూటీతో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు తలకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108లో విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డెంకాడ ఎస్సై సన్యాసి నాయుడు తెలిపారు.
News March 8, 2026
VZM: రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

విజయగరం జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
➤VZM–సంబల్‌పూర్ 3వ లైన్ పనులకు వారంలో విత్‌డ్రావల్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశం ➤కొత్తవలస–VZM 4వ లైన్ పనులకు గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
➤ఖుర్దా రోడ్–VZM 3వ లైన్‌కు స్ట్రక్చర్ వ్యాల్యూయేషన్ రిపోర్టులు సిద్ధం చేయాలని ఆదేశం
➤జిల్లాలో మంజూరైన 17 ROB పనులపై ఆరా
News March 8, 2026
VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.


