News August 26, 2024
ఎమ్మిగనూరులో ఇంద్రధనస్సు కనువిందు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంటూ సాయంత్రం వేళ ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడి పట్టణవాసులకు కనువిందు చేసింది. ప్రజలు ఈ ఇంద్రధనస్సు చిత్రాలను తమ ఫోన్లలో బంధించారు.
Similar News
News January 12, 2026
అక్షరాంధ్రతో జిల్లాలో అక్షరాస్యత పెంపు: కలెక్టర్

కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని 1.61 లక్షల నిరక్షరాస్యులకు వాలంటీర్ల ద్వారా చదువు నేర్పించి, మార్చి 29న జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించి ప్రోత్సహించాలని సూచించారు.
News January 12, 2026
పోలీస్ పీజీఆర్ఎస్‌కు 72 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్, భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ నేడు

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.


