News August 27, 2024

టెస్ట్ క్రికెట్‌కే నా ప్రాధాన్యత: సూర్య కుమార్

image

ఎప్పటికైనా తన ప్రాధాన్యత రెడ్‌బాల్ క్రికెట్(టెస్టులు)కే అని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ముంబైలోని స్టేడియాల్లో తాను టెస్ట్ క్రికెట్ ఆడుతూ పెరిగానని చెప్పుకొచ్చారు. టెస్టు ఫార్మాట్‌పై అప్పుడు పుట్టిన ప్రేమ ఎప్పటికైనా అలాగే ఉంటుందని సూర్య చెప్పారు. బుచ్చిబాబు టోర్నమెంట్‌ కోసం ప్రిపేర్ అవుతున్న సూర్య ఓ చిట్‌చాట్‌లో ఈ విషయాలు వెల్లడించారు.

Similar News

News March 26, 2026

‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ మీమ్స్.. కారణమిదే!

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా తానే ఉండాలని ఆ దేశ నేతలు అడిగారని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పదవిని తాను కోరుకోలేదని గొప్పలు చెప్పడంపై మీమ్స్ పోటెత్తుతున్నాయి. ‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గడ్డంతో ఉన్న ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘అయతుల్లాగా ట్రంప్ ఛార్జ్ తీసుకున్నారు. పరిస్థితి దారుణంగా మారొచ్చు’ అని సెటైర్లు వేస్తున్నారు.

News March 26, 2026

‘చుప్పనాతి శూర్పణఖ’ అంటే ఎవరు?

image

మోసం, కపటం, ఓర్వలేనితనం వంటి గుణాలున్న మహిళల గురించి చెప్పే సందర్భంలో ‘చుప్పనాతి శూర్పణఖ’ జాతీయాన్ని వాడతారు. రామ రావణ యుద్ధానికి మూలకారణం శూర్పణఖ. ఆమె రావణాసురుడి చెల్లెలు. పంచవటిలో రాముడిని చూసి మోహించింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోసేయడంతో ప్రతీకారంగా సీతపై తన అన్నకు కోరిక పుట్టేలా, రాముడిపై శత్రుత్వం పెరిగేలా చేసింది. మీ జీవితంలో చుప్పనాతి శూర్పణఖ ఎవరో కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 26, 2026

బస్సు ప్రమాదాలు ఆగేదెన్నడు: హీరో నిఖిల్

image

మార్కాపురం <<19478496>>బస్సు<<>> ప్రమాదంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు తెలిసి గత 6 నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. అధికారులు అన్ని ట్రావెల్స్ బస్సులు & రవాణా సంస్థలను తనిఖీ చేయాలి’ అని PM మోదీ, కేంద్ర & తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు.