News August 27, 2024
శ్రీకాకుళం జిల్లాలో రెండు కొత్త ఇసుక స్టాక్ పాయింట్లు

గార మండలం శాలిహుండం, బూర్జ మండలం ఖండ్యాంలో కొత్తగా రెండు ఇసుక స్టాక్ పాయింట్లను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ స్టాకు పాయింట్ల నుంచి ఇసుక పొందేందుకు ముందుగా సంబంధిత బుకింగ్ పాయింట్ల వద్ద నమోదు చేసుకుని స్లిప్పులను పొందాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Similar News
News March 27, 2026
SKLM: ఉద్యోగాలిప్పిస్తామని భారీ మోసం..!

పలాస(M) ఉదయపురం కాలానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు అతని నుంచి రూ.లక్షల్లో నగదు కాజేసి మోసం చేశారు. ఈ ఘటనలో 2014లో పలాస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం వాదనలు విన్న పలాస మున్సిప్ కోర్ట్ నేరం రుజువు కావడంతో నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
News March 26, 2026
పొందూరులో 32 ఏళ్ల యువకుడు సూసైడ్

పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(32) గురువారం ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ ఉరివేసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ మరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 26, 2026
ఎచ్చెర్లలో యాక్సిడెంట్..తల్లీ, కుమారుడు మృతి

ఎచ్చెర్ల మండలం అక్కివలస జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు..విశాఖకు చెందిన నరేంద్ర కుమార్ తల్లితో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల హైవేపై వెనక నుంచి లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


