News August 27, 2024
ట్రంప్‌కు మద్దతుగా తులసి గబ్బార్డ్

డెమోక్రట్ మాజీ నేత తులసి గబ్బార్డ్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మిచిగాన్‌లో నేషనల్ గార్డ్ అసోసియేషన్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా బహుళ యుద్ధాలను ఎదుర్కొంటుందని, ఎన్నడూ లేని విధంగా అణు యుద్ధం అంచున ఉందని పేర్కొన్నారు. దీని నుంచి ట్రంప్ బయటపడేస్తారని చెప్పారు. కాగా ట్రంప్‌కు ప్రసంగాలు, డిబేట్లలో తులసి సలహాదారుగా వ్యవహరిస్తారు.
Similar News
News January 17, 2026
రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్ర ముప్పు!

రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలిస్థానీ, బంగ్లా టెర్రర్ సంస్థలు దాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ-NCR, UP, రాజస్థాన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్యాంగ్స్టర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలో <<18265346>>కారు పేలుడు<<>> నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.
News January 17, 2026
వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టిన మరాఠా

అధికారం కోసం చేసే రాజకీయ విన్యాసాలను ప్రజలు తిరస్కరిస్తారనేందుకు MH మున్సిపల్ ఎన్నికలే తార్కాణం. 2023లో NCP చీలి బాబాయ్, అబ్బాయి శరద్, అజిత్ పవార్లు విడిపోయారు. తాజా ఎన్నికల్లో చేతులు కలిపారు. అటు అన్నదమ్ములు ఉద్ధవ్(శివసేన), రాజ్ ఠాక్రే(MNS)లు కూడా విభేదాలు పక్కనపెట్టి MNP ఎన్నికల్లో కలిసిపోయారు. కానీ వీరికి ఆశించిన ఫలితాలు రాలేదు. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిద్దామనుకున్న వీరిని ప్రజలు ఆదరించలేదు.
News January 17, 2026
ఇరాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు కష్టమేనా?

ఇరాన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్‌కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.


