News August 27, 2024
అవకాశమొస్తే ప్రభాస్‌తో మళ్లీ నటిస్తా: ఈశ్వర్ హీరోయిన్

ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ తనకెంతో ప్రత్యేకమని హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో రీరిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్ అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని చెప్పారు. ‘సుందరకాండ’ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తానని చెప్పారు. ఈశ్వర్ సినిమా రీరిలీజ్ రోజున మొదటి షో చూస్తానని తెలిపారు.
Similar News
News September 14, 2025
BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.
News September 14, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.
News September 14, 2025
ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

TG: హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.