News August 27, 2024

పొందూరు: దిల్లీ కార్యాచరణకు సిద్ధం కావాలి

image

పొందూరు మండల కేంద్రంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల సహారా ఏజెంట్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహారా బ్యాంక్ ఖాతాదారుల తరఫున త్వరలో ఢిల్లీలో చేపట్టబోయే కార్యాచరణకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సహారా కస్టమర్స్ అండ్ ఫీల్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బైపల్లి సత్యరాజు కోరారు.

Similar News

News March 4, 2026

శ్రీకాకుళం: టెన్త్ పాస్..230 ఖాళీలకు జాబ్ మేళా

image

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 6న ఉదయం 10 గంటల కు ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి సుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిందో ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 4, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ అనురాధ బుధవారం విడుదల చేశారు. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News March 4, 2026

శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్టే?

image

ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ఖరారు సైతం జరగలేదు. ఎన్నికలపై స్పష్టత వచ్చేవరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగనుంది.