News August 27, 2024

బేస్తవారిపేట: రేపు జాబ్ మేళా

image

బేస్తవారిపేటలోని కందుల ఓబులరెడ్డి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కందుల ఓబులరెడ్డి తెలిపారు. అమెజాన్, బ్లూస్టార్, టెక్ మహీంద్ర, పేమెంట్ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్, డీమార్ట్, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా కార్ట్, హంటర్ డౌగ్లాస్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు.

Similar News

News January 13, 2026

ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

image

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News January 13, 2026

సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

image

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

News January 13, 2026

త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

image

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.