News August 27, 2024

నేటి నుంచి బుచ్చిబాబు టోర్నీ.. బరిలోకి స్టార్లు

image

బుచ్చిబాబు టోర్నీలో భాగంగా ఇవాళ ఉ.9.30 గంటలకు ప్రారంభం కానున్న గ్రూప్-సి తొలి మ్యాచ్‌లో తమిళనాడు CA ఎలెవన్‌తో ముంబై తలపడనుంది. ముంబై తరఫున సూర్యకుమార్, శ్రేయస్, సర్ఫరాజ్ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీకి ముందు సూర్యకిది వార్మప్‌గా ఉపయోగపడనుంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటిదాకా తన మార్క్ చూపించని శ్రేయస్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది. అంతర్జాతీయ సిరీస్‌లకు ఎంపిక కావడానికి సర్ఫరాజ్‌కు ఇది మంచి అవకాశం.

Similar News

News March 7, 2026

కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

image

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News March 7, 2026

‘గద్దర్’ అవార్డులపై నాగ్ ప్రశంసలు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డ్స్’ విజేతలకు అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రి ANR పేరిట అవార్డును ఇచ్చినందుకు CM రేవంత్ రెడ్డి, Dy.CM భట్టిలకు ధన్యవాదాలు తెలిపారు. ANR అవార్డు పొందిన జయసుధకు, NTR అవార్డు గ్రహీత చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తన కుమారుడు నాగచైతన్యను ‘దుల్ల కొట్టావ్ నాన్న’ అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు.

News March 7, 2026

హెలికాప్టర్‌లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

image

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.