News August 27, 2024
అనకాపల్లి జిల్లాలో హత్య

అన్నదమ్ముల మధ్య జరిగిన తగాదాలో చిన్నాన్నను హత్యచేసిన ఘటన మాకవరపాలెం మండలంలోని తాడపాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గనిశెట్టి జోగులు(72) అన్న కొడుకులు భాస్కరరావు, దొరబాబు సోమవారం రాత్రి స్థల వివాదమై గొడవపడ్డారు. దీంతో జోగునాయుడు మధ్యలోకి వెళ్లడంతో దొరబాబు కత్తితో పొడిచి హత్యచేశాడు. పాత తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్టు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 5, 2025
విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు. విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.
News July 4, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.
News July 4, 2025
లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.