News August 27, 2024

Stock Market: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

image

స్టాక్ మార్కెట్లు స్తబ్ధుగా మొదలయ్యాయి. సూచీలు మళ్లీ గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 81,815 వద్ద మొదలైన BSE సెన్సెక్స్105 పాయింట్ల లాభంతో 81,803 వద్ద కొనసాగుతోంది. NSE నిఫ్టీ 24 పాయింట్లు ఎగిసి 25,034 వద్ద చలిస్తోంది. ఎల్‌టీ, సిప్లా, ఇన్ఫీ, HCL టెక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్. BPCL, JSW స్టీల్, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ టాప్ లూజర్స్.

Similar News

News January 15, 2025

తిరుమలలో రూ.300 టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్

image

AP: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ₹300 నకిలీ టికెట్లతో పలువురు దర్శనానికి వెళ్తుండగా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా ఈ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News January 15, 2025

క‌ర్ణాట‌క సీఎం: మార్చి త‌రువాత మార్పు?

image

CM సిద్ద రామ‌య్య త్వ‌ర‌లో త‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. మార్చిలో బ‌డ్జెట్ అనంత‌రం DK శివ‌కుమార్ CM ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని ప్రచారం జరుగుతోంది. ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం బాధ్య‌త‌ల బ‌దిలీ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. అందుకే సిద్ద రామ‌య్య ఎంపిక చేసిన మంత్రులు, MLAల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై పార్టీ నేత‌లు బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని అధిష్ఠానం ఇప్ప‌టికే ఆదేశించింది.

News January 15, 2025

ఆతిశీ జింకలా పరిగెడుతున్నారు.. మళ్లీ నోరు జారిన బిధూరీ

image

ఢిల్లీ CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ <<15102620>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.