News August 27, 2024

బాలీవుడ్ హీరోయిన్‌ను బంధించి వేధిస్తారా జగన్: TDP

image

AP: YS జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై TDP సంచలన ఆరోపణలు చేసింది. ‘బాలీవుడ్ హీరోయిన్ కోసం నువ్వు, నీ సలహాదారుడు కలిసి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా? స్పెషల్ ఫ్లైట్లలో ఆమెను విజయవాడ తీసుకొస్తారా? ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బంధించి వేధిస్తారా? ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికా? బెంగళూరులో అసలు నువ్వు ఏం చేస్తున్నావ్? సమాధానం చెప్పు జగన్?’ అని జగన్, సజ్జల ఫొటోను ట్వీట్ చేసింది.

Similar News

News January 9, 2026

శరీరానికి కొల్లాజెన్ ఎందుకు అవసరమంటే?

image

కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ స్థాయి తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, మొటిమలు రావడం, ఎముకలు బలహీనపడటం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాలను దృఢంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

News January 9, 2026

నరదిష్టి ప్రభావం తొలగిపోవాలంటే?

image

నరదిష్టి ప్రభావంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సముద్ర జలాలను ఇల్లు, వ్యాపార స్థలాల్లో చల్లాలి. దొడ్డు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయాలి. మంగళవారం ఎరుపు వస్త్రంలో ఉప్పు కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. మరుసటి రోజు చెట్టు మొదట్లో వేయాలి. సాంబ్రాణి ధూపం, వినాయకుడి వద్ద దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తాయి’ అంటున్నారు.

News January 9, 2026

కొల్లాజెన్ ఎక్కువగా దొరికే ఆహారాలు

image

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, జుట్టు మృదువుగా, ఉండాలన్నా కొల్లాజెన్‌ కీలకం. కొల్లాజెన్ కోసం సాల్మన్, ట్యూనా, సార్డినెస్ చేపలు, సిట్రస్‌ పండ్లు, బెర్రీలు, గుడ్లు, పాలకూర, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కొల్లాజెన్ దొరుకుతుంది. ధూమపానం, ఎండలో గడపడం, అధిక చక్కెరలు, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, అధిక ఒత్తిడి స్థాయులు కూడా శరీరంలో కొలాజెన్‌ క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.